అన్నమయ్య జిల్లా డిసెంబర్ 03
(నవ్యంధ్ర న్యూస్ )
రెండు రోజులలో అన్నమయ్యకాలిబాటలో రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి 22వ తిరుమల మహా పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఏనుగులు, పులుల సంచారంఅంటూ జిల్లా ఫారెస్ట్ అధికారి జగన్నాద్ సింగ్,ఎస్పీ దీరజ్ కునుబిల్లి మీడియా సమావేశం నిర్వహించి శేషాచల అడవుల మార్గంలో తిరుమల పాదయాత్ర నిషేధం పై అటవీశాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కుంటలు, వంకలు నిండి
పొర్లుతునందున
అడవిలో ఏనుగులు,
ఎనుగుపిల్లలు,చిరుతలు సంచరిస్తుండటంతో భక్తులకు ప్రాణాపాయం ఉన్నది కావున భక్తులు,ప్రజలు
ఈ మార్గంలో కాకుండా తిరుమల వెళ్లాలంటే రోడ్డు మార్గం గుండా వెళ్లాలని అధికారుల సూచించారు.ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించి
ఈ మార్గంలో తిరుమలకు వెళ్లే ప్రయత్నం, సాహసం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

