జన్మదిన వేడుకలలో కేకులు కట్ చేయకుండా తాజా పండ్లు కట్ చేసి నిర్వహించుకోవాలి

Spread the love

వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులుకొండూరు శరత్ కుమార్

అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 24

( నవ్యాంధ్ర న్యూస్ )

రాజంపేట భారతీయ విద్యా నికేతన్ పాఠశాలలో బుధవారం న్యాయవాది,వాకర్ కరణం శివ శంకర్ నాయుడు జన్మదిన వేడుకలను వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ఉపాధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు, అసోసియేషన్ సభ్యులు వినూత్న రీతిలో పుచ్చకాయను కట్ చేసి ఘనంగా నిర్వహించారు
ఈ సందర్బంగా వాకర్స్ మాజీ ఉపాధ్యక్షులు వాకర్ కొండూరు శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ స్థానిక వాకర్స్ అసోసియేషన్ లో 500మంది సభ్యులు కలిగిన గొప్ప క్లబ్ అని,పరిసర ప్రాంతాలలో విరివిగా మెగా ఐ క్యాంపులు,మెడికల్ క్యాంపులు,ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూన్నామన్నారు
వాకర్ అసోసియేషన్ సభ్యులందరూ నిండు నూరేళ్లుఆయురారోగ్యలు,అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్ధిస్తూ, ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు.
వాకర్స్ ఇంటర్నేషనల్ చరిత్రలో ఒకే రోజు సమాజసేవ కోసం మహాత్మ గాంధీ అవార్డు ఫెలోషిప్ లో 10,000 వెచ్చించించి 108 మంది సభ్యత్వం పొందడం సభ్యుల ధాత్రుత్వానికి నిదర్శనంగా నిలిచారని వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ సభ్యుల సేవలు రాజంపేటకే గర్వకారణమన్నారు
బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయన్ని పక్కన పెట్టి న్యాయవాది,వాకర్ కరణం శివ శంకర్ నాయుడు జన్మదిన్నాన్ని ఒక వినూత్నరీతిలో కేక్ కట్ చేసే విధానానికి స్వస్తి పలుకుతూ తాజా పండు కట్ చేసి నిర్వహించామన్నారు ప్రజలందరూ ఇప్పటి నుండి జన్మదిన కార్యక్రమాలలో కేక్ లు కట్ చేయకుండా స్వచ్ఛమైన తాజా పండ్లను కట్ చేసి నిర్వహించాలన్నారు
ఈ సందర్బంగా పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శి సుబ్బరామ రాజు, వెంకటయ్య నాయుడు,వాకర్ అమ్మినేని వెంకటయ్య నాయుడు,చేజర్ల సుబ్రహ్మణ్యం రాజు,సుబ్బరామ రాజు, వాకర్. దగ్గుపాటి రవి, వాకర్.శివ రామ రాజు, వాకర్.సుబ్బరాజు,వాకర్
శ్రీనివాసులు నాయుడు, వాకర్ జయచంద్ర రాజు,వాకర్. రఘువీర్ రాజు, వాకర్. కొమ్మి రామచంద్ర, రామచంద్ర రాజు, ఎన్. రెడ్డయ్య, బాలాజీ, మెడికొండు రవి, నాసర్, మురళి, మోహన్ రాజు, సుధీర్, మల్లి కార్జున, అమర్, శంకర్ రాజు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *