రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు అధ్యక్షులను కూటమి ప్రభుత్వం నియమించింది
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 18
( నవ్యాంధ్ర న్యూస్ )
శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన అధ్యక్షులు గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడును కూటమి ప్రభుత్వం నియమించింది
ఈ సందర్భంగా పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన అధ్యక్షులుగా నియమించబడటం నా పూర్వజన్మ సుకృతం అన్నారు నాకు మహాశివుని సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు

