( నవ్యాంధ్ర న్యూస్ ) అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నిశాంత్ కుమార్ ఐఏఎస్…
తన ఛాంబర్ లో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్…
నూతన కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, పలువురు అధికారులు…
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ గా పని చేస్తూ ఇటీవల జరిగిన బదిలీలల్లో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా బదిలీ పై వచ్చిన నిశాంత్ కుమార్…
నూతన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కామెంట్స్ :-
అందరి సహకారంతో అన్నమయ్య జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తా…
జిల్లాలోని రైతంగానికి అండగా నిలుస్తా.. వారి అభివృద్ధి కోసం కృషి చేస్తా…
తాగు, సాగునీటి సమస్య పై ప్రత్యేక దృష్టి పెడతా…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తా…

