అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ,సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లాపరిధిలోని రాజంపేటలో శనివారం స్వయం ఉపాధి కోసం నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని, నైపుణ్య చేతివృత్తుల వారి కోసం విశ్వకర్మ కేంద్రాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి శిక్షణా కేంద్రాలు గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి,మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో
ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి,శాసనసభ్యులు పార్ధసారధి,BJP జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్,నిర్వాహకులు, స్థానిక ప్రజలు,పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

