బొప్పాయి రైతుల పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

Spread the love

అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06

( నవ్యాంధ్ర న్యూస్ )

జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శనివారం చిట్వేలి మండలంలోని బొప్పాయి రైతుల పంట పొలాలను సందర్శించారు. మండలంలోని రైతు ప్రభాకర్ రెడ్డి 35 ఎకరాలలో, శివరాం రెడ్డి 10 ఎకరాలలో బొప్పాయి సాగు చేస్తున్న పంట పొలాలను పరిశీలించారు. వారి పొలాలలో పంట పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, ఎన్ని క్రాప్‌లు వస్తాయి? ఒక్కో క్రాప్‌కు ఎంత దిగుబడి వస్తుంది? అనే అంశాలపై రైతులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ఢిల్లీ మార్కెట్‌లో బొప్పాయి కిలో ధర రూ. 40గా ఉంటే, రైతులకు కేవలం రూ. 5 మాత్రమే ఎందుకు చెల్లిస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. రైతులకు సరైన ధర అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు
చిట్వేలి, పెనుగులూరు మండలాలలోని ప్రతి రైతును మానిటర్ చేయాలని,వారి పంట పరిస్థితిని,మార్కెట్‌లో విక్రయ స్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన సమాచారం సరైన సమయంలో చేరేలా విహెచ్ఎలు, విఆర్ఓలతో గ్రామస్థాయి అధికారులను బొప్పాయి రైతులకు అనుసంధానం చేయాలని, ప్రతి రైతును పర్యవేక్షించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉద్యాన శాఖ అధికారి సుభాషిణిని ఆదేశించారు.రైతులకు మార్కెట్ పరిస్థితులు, ధరలపై సరైన అవగాహన కల్పించడం ద్వారా వారికి న్యాయమైన గిట్టుబాటు ధర లభించేలా సమగ్రంగా పనిచేయాలన్నారు
బొప్పాయి రైతులకు మార్కెట్‌లో సరైన ధర లభించేలా జిల్లా యంత్రాంగం సమన్వయంగా పనిచేస్తుందని, అవసరమైన సమాచారం అందించేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు రైతులు ఆందోళన చెందకుండా, సరైన మార్కెట్ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *