అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని ఏ బి చంద్రారెడ్డి కళ్యాణ మండపంలో శనివారం రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొట్ట మొదటిసారి నియోజకవర్గానికి విచ్చేసిన నాగోతు రమేష్ నాయుడుకు ఎర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ ఇరువురికి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఘన స్వాగతం పలికారు
అనంతరం అభినందన సభలో చమర్తి మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు డాక్టర్ సత్య కుమార్ రాజంపేటకు తొలిసారిగా విచ్చేయడం సంతోష దాయకమన్నారు రాజంపేట అభివృద్ధికి సహకరించాలని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి,పరికరాలు కొరతగా ఉందని మంత్రికి తెలియజేసారు స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి
వర్యులు నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి అన్ని విధాలుగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు రాజంపేట నుండి నాగోతు రమేష్ నాయుడు ఒక కార్యకర్తగా విద్యార్థి దశ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం అభినందనీయమన్నారు నాగోతు రమేష్ నాయుడు ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలన్నారు
ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

