అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
2004 – 09లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, సాయి ప్రతాప్ కేంద్ర సహాయ మంత్రిగా,ప్రభావతమ్మ శాసన సభ్యురాలిగా రాజంపేటను మునిసిపాలిటీగా చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నది వాస్తవం. తెలుగుదేశం ఆవిర్భావం
నుంచి పదిహేను సంవత్సరాలలో బండారు రత్నసభాపతి అత్తిరాల పధకం,ఆల్విన్ ఫ్యాక్టరీలను సాధిస్తే, పసుపులేటి బ్రహ్మయ్య చక్రాలమడుగు పైన బ్రిడ్జి తీసుకు వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 – 09
రాజంపేటకు 180 కోట్ల పనులు సాధించిన స్వర్ణ యుగంగా అభివర్ణించ
వచ్చు.అన్నమయ్య త్రాగునీటి పధకం 42 కోట్లు,రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి 25 కోట్లు, బాలరాజుపల్లె బ్రిడ్జి 17 కోట్లు, రాజంపేట సానిపాయ రోడ్డు విస్తరణ 15 కోట్లు,రాజంపేట ప్రధాన రహదారి అంతర్గత రోడ్లు సెంట్రల్ లైటింగ్ మురుగు కాలువలు 16 కోట్లు, మునిసిపల్ కార్యాలయం 2 కోట్లు, ఆర్ అండ్ బి బంగాళా ఇతర భవనాలు 7 కోట్లు, పాత పార్క్ వద్ద వాణిజ్య భవన సముదాయం 2 కోట్లు, నూనెవరిపల్లె రోడ్ ౩ కోట్లు, మన్నూరు బలిజపల్లె రోడ్ సంబంధిత పనులు 5 కోట్లు, రాంనగర్, మన్నూరు, బలిజపల్లె, మన్నూరు బ్రాహ్మణ స్మశానాలకు ప్రహరీలు, విద్యుత్ దహన వాటికలకు ౩ కోట్లు, చెత్త డంపింగ్ యార్డ్ గోడలకు 50 లక్షలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవన వసతికి 2 కోట్లు, పాత కంపోస్ట్ యార్డ్ పార్క్ అభివృద్ధికి 90 లక్షలు, అన్నమయ్య విగ్రహం, తాళ్ళపాక రోడ్ విస్తరణ,అత్తిరాల గుండ్లూరు రహదారులకు 7 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేసి పట్టణ స్వరూప స్వభావాన్ని మర్చివేసాయి తెలుగు దేశం పరిపాలనలో రాజంపేటకు పెద్దగా ఒరిగిందేమిలేదు. వచ్చి ఏడాదిన్నర దాటినా అన్నమయ్య పునర్నిర్మాణం ఊసే లేదు. 2011 తరువాత మండలంలో వైస్సార్ కాంగ్రెస్ పాలనలో 25 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి పునర్నిర్మాణం కూటమి హయాంలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఇవ్వలేదు, ప్రధాన రహదారి వెంట భూములు ఉన్న కంప చెట్లలో కోర్టు భవనాలకు స్థలం చూపించారు, టిడ్కో భూములు ఎక్కడున్నాయో తెలియదు.అన్నమయ్య ప్రాజెక్ట్ అతి,గతి లేదు. విద్యసంస్థలు చెరువులు ఆక్రమించిన చర్యలు లేవు.పట్టణంలో వాహన తాకిడి పెరిగి
అడుగడుగునా అడ్డంకులున్నా పరిష్కారాలు లేవు. వైద్య కళాశాల లేదు, జిల్లా అడిగితే మీరు ఓట్లు వెయ్యలేదంటారు. అభ్యర్థిని చూసి కాదు ఓట్లు వేయాల్సింది పార్టీని చూసి అంటున్నారు ఆలా ఎక్కడన్నా 100% జరుగుతుందా ముఖ్యమంత్రి రాజంపేటకు నిధులు కేటాయించకుండా,
వైకాపా ను మించి కూటమి ప్రభుత్వం రాజంపేటకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నది ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలలో నడుస్తూ ఉంటె రెవిన్యూ స్థలంలో అధికారులు పోని అఫీషియల్ క్లబ్ లో ఒక ప్రైవేట్ కాంటీన్ నడుస్తుంది. రెడ్డివారి వీధి లో గతంలో పాఠశాల నడిచిన భవనంలో ప్రైవేట్ సిమెంట్ గోడం ఉంది. బాడుగలు ఎవరికి వెళ్తున్నాయి ప్రభుత్వ భవనాలు ప్రైవేటు వ్యక్తులు చేతులలో ఉన్నాయని కుటమి ప్రభుత్వ పాలన పై రాజంపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పూల భాస్కర్ మండిపడ్డారు ఇప్పటికైనా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ స్థలాలలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయ భవనాలగా మార్చాలన్నారు.ఆర్ఓబి పనులు చేపట్టి రైల్వే స్టేషన్ అవతల నివాసులకు,విద్యార్థిని, విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు

