అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత సరుకుల పై విధించిన 50 శాతం సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ వామపక్షాల కమిటీ పిలుపుమేరకు అమెరికా తీసుకున్న నిర్ణయం పై శుక్రవారం జాతీయ రహదారిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వామపక్షాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్, పందికాళ్ల మణి,సిపిఐ పట్టణ కార్యదర్శి
ఈ. సికిందర్ లు మాట్లాడుతూ భారతదేశ సరుకుల దిగుమతి పై 50 శాతం సుంకాన్ని పెంచుతూ డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం చాలా దుర్మార్గమన్నారు. దేశ ప్రధాని స్పందించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ దేశ ప్రజలకు, రైతులకు చాలా బాధాకరమని మనదేశంలో ఉత్పత్తులు, రైతాంగ సమస్యలు, రొయ్య,చేపలు, టెక్స్టైల్స్ వంటి చిన్న చిన్న ఉత్పత్తులు లేక కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఇలాంటి పరిస్థితులలో కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అమెరికా అధ్యక్షుడు పై ప్రధాని మోదీ ఏ ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తుల పైన సుంకాన్ని తగ్గించి యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం,సిపిఐ నాయకులు డి.వి రమణయ్య, ప్రసాద్, కుమార్,రమణ, నాగేశ్వర్,రవి,నాగేంద్ర, రమేష్ ,సుబ్రహ్మణ్యం సురేష్ ,శివా, పెంచలయ్య.రాజశేఖర్ ఆదినారాయణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

