అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా (AMC) గన్నే సుబ్బనరసయ్య నాయుడుని నియమించిన శుభ సందర్భంగా స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఐటీ శాఖామంత్రివర్యులు నారా లోకేష్, నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజులకు గన్నే సుబ్బనరసయ్య నాయుడు, పార్టీ శ్రేణులు భారీ గజమాలతో జగన్మోహన్ రాజును ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా గన్నే సుబ్బనరసయ్య నాయుడు మాట్లాడుతూ సిన్సియర్ గా పనిచేసిన ప్రతి కార్యకర్తని పార్టీ గుర్తిస్తుందని తెలియజేస్తూ పార్టీ తన పై నమ్మకం ఉంచి AMC అధ్యక్షులుగా తనను నియమించి నందున తన భాద్యత మరింత పెరిగిందని, కార్యకర్తలకి అండగా ఉంటూ పార్టీకి మరింత బలం చేకూరే విధంగా పనిచేసి లోకల్ బాడీలో పట్టు సాధించి 2029 లో రాజంపేటలో తెలుగుదేశం పార్టీని తప్పకుండా గెలిపించు
కుంటామన్నారు

