వైయ‌స్ఆర్‌.. మూడ‌క్ష‌రాల పేరు మాత్ర‌మే కాదు. కోట్లాది తెలుగు ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. తెలుగు నేల‌పై వైయ‌స్ఆర్ చెరిగిపోని జ్ఞాప‌కం

Spread the love

అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 02

( నవ్యాంధ్ర న్యూస్ )

వైయస్సార్ తొలి సంతకం 7 గంటల ఉచిత విధ్యుత్ ఇచ్చి రైతుల దశ దిశ మార్చినటువంటి రైతు బాంధవుడు, పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనుడు, అనేక నీటి ప్రాజెక్టులు జలయజ్ఞం కార్యక్రమంలో కరువు ప్రాంతాలకు సాగు,త్రాగునీరు అందించిన ప్రజా నాయకుడు,పేద విద్యార్థులు చదువు ఆపకూడదనే తపనతో వాళ్ళ భవిష్యత్ కు బంగారు బాట వేసే విధంగా ఫీజు రీ ఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టినటువంటి పేద విద్యార్థుల ఆశాజ్యోతి, పావలా వడ్డీ ఋణంతో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి ఆత్మబంధువు, 200 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి పెద్ద కొడుకై, పేదలకు ఆరోగ్యశ్రీ తో ఎన్నో దీర్ఘాకాలిక అనారోగ్య సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపి,108,104 వంటి అంబులెన్సు లను ప్రవేశపెట్టినటువంటి మహానేత దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైసీపీ రాజ్యసభ ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి ఘన నివాళులర్పించారు
ఈ సందర్బంగా మేడా రఘనాధ్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయంలో విశ్వసనీయతకి విలువలు అద్ది, రాజసానికి బాటలు వేసిన పెద్దాయన వైయస్సారేనన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *