Spread the love

రైతాంగానికి అంకితభావంతో పనిచేయండి

శీతల గిడ్డంగుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నమయ్య జిల్లా ఆగస్టు 11

( నవ్యాంధ్ర న్యూస్ )

పదవిని బాధ్యతగా స్వీకరించి రైతాంగానికి అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
రైల్వే కోడూరు రాజ్ రెసిడెన్సిలో సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పౌరసరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యులు అరవ శ్రీధర్, తిరుపతి శాసన సభ్యులు ఆరని శ్రీనివాస్, కుడా అధ్యక్షులు ముక్కా రూపానందరెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ వరలక్ష్మి, వైస్ చైర్మన్ శివయ్య, బోర్డు డైరెక్టర్లు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా ఎంపికైన వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు వరలక్ష్మి, ఉపాధ్యక్షులు శివయ్య ఇతర సభ్యులచే ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పదవి అనేది బాధ్యతని ప్రజలకు నిజాయితీ, నిబద్ధత,అంకితభావంతో పనిచేసి అహర్నిశలు కృషి చేస్తున్న రైతాంగం కోసం పనిచేస్తూ దళారీ వ్యవస్థ నుండి రైతులను కాపాడాలన్నారు. అత్యధికంగా వాణిజ్య పంటలు పండుతున్న రైల్వే కోడూరులో శీతల గిడ్డంగుల ఏర్పాటుకు ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటాన్నన్నారు. కమిటీ సభ్యులు కొత్త ఆలోచనలతో మార్కెటింగ్ ఆదాయాన్ని పెంచే దిశలో ఆలోచించాలన్నారు. జిల్లాలోని 11 ఎం ఎల్ ఎస్ పాయింట్ల నుండి నిత్యవసర వస్తువులు సక్రమంగా వెళుతున్నాయా లేదా అన్న అంశాలను ఇంటెన్స్ ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా సేకరిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి, వాటిని విజయవంతంగా అమలు చేస్తూ, రైతుల జీవితాలలో మలుపుతిప్పే మార్పులు తెచ్చామన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసి, వారికి ఆర్థిక భరోసా కల్పించామన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలలో మొత్తం 63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 12,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి కేవలం 24 గంటలలోనే జమ చేసి ఘనత సాధించామన్నారు. రైతులు తమ ఇష్టానుసారం మిల్లులకు ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం కల్పిస్తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందన్నారు
సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా, దీపం పథకం కింద మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు . జిల్లాలోనే మూడు లక్షల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేశామన్నారు పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 1,240 గ్రామపంచాయతీలలో తీర్మానం చేసిన మేరకు సిమెంట్ రోడ్లు సహా మౌలిక సదుపాయాలను ఉప ముఖ్యమంత్రి కల్పించారన్నారు. ప్రభుత్వం నెలకు 2,500 కోట్లు పెన్షన్ల రూపంలో నిరుపేదలకు అందజేస్తోందన్నారు
రాష్ట్రంలో వున్న ఆర్థిక పరిస్థితులను అధిగమించి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని పార్టీలకతీతంగా ప్రజలకు అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు వరలక్ష్మి, మాట్లాడుతూ
రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ యార్డ్ సదుపాయాల అభివృద్ధి, పారదర్శక విధానాల అమలుపై కృషి చేస్తానన్నారు
ఈ కార్యక్రమంలో
పలువురు రైతు నాయకులు, అధికార ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *