వీర జవాన్ మురళి నాయక్, మృతదేహానికి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఘన నివాళి

Spread the love

హైదరాబాద్: 2025 మే 11 ( నవ్యాంధ్ర న్యూస్ )

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందాడు ఏపీ జవాన్ మురళీ నాయక్. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన అతను జమ్మూకశ్మీర్‌లోని ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మురళీ నాయక్ స్వగ్రామంలో వీర జవాన్ అంత్యక్రియలు జరగనున్నాయి జవాన్ వీర మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రగా ఢ సానుభూతి తెలిపారు. అలాగే ప్రభుత్వం తరఫున మంత్రి సవిత చేతుల మీదుగా రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు మురళీ నాయక్ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉండేందుకు తన వంతుగా ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. రేపు ఉదయం బాలకృష్ణ మురళీ నాయక్ స్వగ్రామం కల్లితండాకు బాలయ్య వెళ్లనున్నారు. జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఈ ఆర్థిక సాయాన్ని వారికి అందజేయనున్నారు మురళీ నాయక్ అంత్యక్రియల్లో పవన్ కల్యాణ్. బాలకృష్ణతో పాటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జవాన్లకు సంఘీభావంగా తన ఒక నెల జీతం రూ.2.17 లక్షలను నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కల్లితండాకు తీసుకు వస్తున్న సమయంలో జై జవాన్ జై జవాన్ అంటూ రోడ్డు పొడవునా జనం నివాళులు అర్పించారు. ఆదివారం మురళీ నాయక్‌ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించ నున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మురళీ నాయక్ అంత్య క్రియల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన కల్లితండాకు చేరుకుని జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *