రైస్ కార్డు పొందుటకు అర్హతలు :

Spread the love

1.కొత్త బియ్యం కార్డు :

  • > బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికుడు అయ్యి ప్రజసాధికార సర్వే అనగా హౌస్ హోల్డ్ మాపింగ్ లో తప్పనిసరిగా ఉండవలెను.

•> ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయ్యి వుంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి మాత్రమే అయ్యి ఉండాలి.

ముఖ్య గమనిక :

ఇప్పటి వరకు ఎవరికీ అయితే బియ్యం కార్డు లేదో అనగా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మ గారి బియ్యం కార్డు లో కానీ అత్త గారి కార్డు లో కానీ లేని వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇవ్వబడును.

  1. బియ్యం కార్డు లో వ్యక్తులను జోడించడం :

చిన్నపిల్లల్ని యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, పెళ్లి అయిన వధువు ని జోడించుటకు వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు లో వారి యొక్క భర్త పేరు వున్నచో దానిని పరిగణలోకి తీసుకోవడం జరుగును

ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ ఆ గ్రామానిది అయ్యి ఉండవలెను.

  1. బియ్యం కార్డు విభజన :

బియ్యం కార్డు విభజించడానికి ముందు వారు ప్రజాసాధికార సర్వే లో సెపరేట్ గా ఉండవలెను. లేనిచో విభజించుట కుదరదు.

  1. బియ్యం కార్డు లో వ్యక్తిని తొలగించుట :
    చనిపోయిన వ్యక్తిని మాత్రమే మనం బియ్యం కార్డు నుంచి తొలగించడం జరుగును. అలా కాకుండా చాలా మంది మా అబ్బాయి అమెరికా లో వున్నాడు తను సంపాదించేది మాకు పెడతాడా కార్డు లో నుంచి తీసేయండి ప్రజాసాధికార సర్వే లో నుంచి తప్పించి మాకు బియ్యం కార్డు ఇవ్వమని అడుగుతున్నారు అలాంటివాళ్ళకి గవర్నమెంట్ వారు మళ్ళీ ఆప్షన్ ఇచ్చినపుడు మాత్రమే చేయటం జరుగును గమనించగలరు.
  2. ఆధార్ సీడింగ్ కరెక్షన్

తప్పుగా వున్నా ఆధార్ నీ అలా వదిలేసి కొత్త ఆధార్ తో ముందుగా ప్రజాసాధికార సర్వే లో యాడ్ అయిన తరువాత మాత్రమే ఆధార్ సీడ్ చేయగలము. గమనించగలరు

  1. అడ్రస్ చేంజ్ :

ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా గా ఆ సచివాలయం అడ్రస్ ఉండవలెను మరియు కుటుంబ పెద్ద వేలి ముద్రతో మాత్రమే మనం ఇది చేయగలము గమనించగలరు.

  1. సరెండర్ రైస్ కార్డు :

బియ్యం కార్డు వద్దు అనుకున్న వారు వారి యొక్క బియ్యం కార్డు ని సరెండర్ చేసుకోవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *