అన్నమయ్య జిల్లా (నవ్యంధ్ర)
మండలపరిధిలోని బోయనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భద్రావతి భావనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వైభవంగా రథోత్సవం నిర్వహించారు.
ఉత్సవ కమిటీ సభ్యులు మొదటగా భద్రావతి సమేత భావనారాయణ స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో రథంపై కొలువు తీర్చి గ్రామ పురవీధులలో రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు పద్మశాలీలు భక్తిశ్రద్ధలతో రథోత్సవ పాల్గొన్నారు.ఈ సందర్బంగా గ్రామంలో ప్రత్యేక పండుగ వాతావరణం నెలకొంది.

