కడప జిల్లా మార్చి 29
( నవ్యంధ్ర న్యూస్ )
దేశంలోని హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని విశ్వహిందూ పరిషత్ కడప జిల్లా శాఖ సభ్యులు డిమాండ్ చేశారు.
రాజంపేట మండలపరిధిలోని మునక్కాయలపల్లె రోడ్డు లోని రెడ్డి కల్యాణమండపం లో ఆదివారం నిర్వహించిన హిందూ ఆలయాల సంరక్షణ కార్యక్రమంలో హిందువులు పాల్గొని ఆలయాల నిర్వహణ హిందువులు
నిర్వహించుకునేలా డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకులు హిందువుల ఆలయాలను రాజకీయాల కోసం మాత్రమే ఉపయోగించు
కుంటున్నారని సంస్కృతి సంప్రదాయాలను హిందూ ఆలయాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం
లేదని విమర్శించారు. అందరూ ఐకమత్యంగా పోరాడాల్సి ఉందని పిలుపునిచ్చారు.
ఇతర మతాల మందిరాలు, నిర్వాహకులకు సహాయం చేస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతూ,హిందువుల ఆలయాలలో దోపిడీ చేస్తున్నారనివిమర్శించారు. హిందూ ఆలయాలలో ఆదాయాన్ని ప్రభుత్వాలే లాక్కుని ఇతర మతస్తుల వారికి పంచిపెడుతున్నరన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లాయపల్లి చిన్మయారణ్యం ఆశ్రమం స్వామిని శ్రేయానంద సరస్వతి, కార్యకారిణి సభ్యులు విహెచ్పి రాష్ట్ర కార్యకారిణి సభ్యులు కాకర్ల రాముడు, అన్నమయ్య విభాగ్ కార్యదర్శి బొల్లా శ్రీనివాసులు నాయుడు, జిల్లా అధ్యక్షుడు పోకల ప్రభాకర్, ప్రాంత భజరంగదళ్ ప్రముఖ్ కసాపురం రవి, జిల్లా సహకార దర్శి జి రెడ్డయ్య రాజు, రాష్ట్ర సమాచార ప్రముఖ్ యం.పెంచల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి
వై. జయసింహస్వామి, జిల్లా కోశాధికారి టివి రమణ రెడ్డి రాజంపేట ప్రకండ అధ్యక్షులు వెంకట కృష్ణ, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ నరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు కే వీరారెడ్డి, జిల్లా విశేష సంపర్క ప్రముఖు సుధాకర్ బాబు, జిల్లా సహా కోశాధికారి ఏ సూర్య రంగనాయకులు, అన్ని కుల సంఘాల పెద్దలు,ఆలయాల ధర్మకర్తలు అర్చకులు, విద్యాలయాల నిర్వాహకులకు తదితరులు పాల్గొన్నారు.

