అన్నమయ్య జిల్లా ఆగస్టు 28
(నవ్యంధ్ర న్యూస్ )
నందలూరులో వెలసియున్న శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో సేనతో సేనాని గోడపత్రాలను నందలూరు మండల జనసేన నాయకులు కేదార్నాథ్ సేనతో సేనాని గోడపత్రాలను ఆవిష్కరించారు
ఈ సందర్బంగా కేదార్నాథ్ మాట్లాడుతూ విశాఖపట్నంలో గురువారం నుంచి శనివారం వరకు జనసేన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘సేనతో సేనాని’ కార్యక్రమాల గోడపత్రాలను ఆవిష్కరించమన్నారు
“సేనతో సేనాని” కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి వరకు పార్టీ బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని, ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేయడం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక మండల జనసేన నాయకులు గురివి గారి వాసు,హోటల్ శివ,అరుణ్ పాండే, మస్తాన్ రాయల్,రాము మండెం, ప్రకాష్, ప్రతాప్, హరీష్, అజయ్, చిన్ను, సుబ్బు,జితేంద్ర,రవి తదితరులు పాల్గొన్నారు.

