శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్న హై కోర్ట్ న్యాయమూర్తికె. శ్రీనివాసులు రెడ్డి దంపతులు

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 06

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండలపరిధిలోని భువనగిరిపల్లిలోని గుట్ట పై లక్ష్మినరసింహ స్వామి కొలువు తీరి భువనగిరి లక్ష్మినరసింహ స్వామిగా విరాజీలుతున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
కె. శ్రీనివాసుల రెడ్డి దంపతులు దర్శించుకున్నారు ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్తలు న్యాయమూర్తి దంపతులకుపూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
ఆలయ అర్చకులు హైకోర్టు న్యాయమూర్తి గోత్ర నామాలతో అర్చన, అభిషేకం చేసి తీర్థ ప్రసాదలు అందజేశారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు వారిని స్వామివారి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈసందర్బంగా న్యాయమూర్తి శ్రీనువాసుల రెడ్డి మాట్లాడుతూ
ఈ భువనగిరి లక్ష్మీనరసింహాస్వామి చాలా మహిమ కలిగిన దేవుడని,ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవటం
అదృష్టంగా
భావిస్తున్నానన్నారు. న్యాయమూర్తితో కలసి కడప జిల్లాన్యాయమూర్తి యామిని,రాజంపేట జిల్లా న్యాయమూర్తి
ఎస్.ప్రవీణ్ కుమార్, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కేశవరావు,జూనియర్ సివిల్ న్యాయమూర్తి,
పి.రాజన్ ఉదయ్ ప్రకాష్,సబ్ కలెక్టర్ శ్రీమతి హెచ్ ఎస్. భావన, తహసీల్దార్ పీరు మున్ని, అర్బన్ సిఐ నాగార్జునలు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి లక్ష్మి నరసింహస్వామి ఆలయ ధర్మకర్తలు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *