న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 10
(నవ్యంధ్ర న్యూస్ )
గల్ఫ్,యూరప్,అమెరికా, అబుదాబి దేశాలకు తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని
“రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాధరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప, అన్నమయ్య,నెల్లూరు, చిత్తూరు,అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో గల్ఫ్,యూరప్ పాశ్చాత్య దేశాలలో ఉపాధి పొందుతున్నారని
ఈ ప్రాంతాల నుండి ప్రయాణీకులు ఉన్నత విద్య,ఉద్యోగ రీత్యా, వ్యాపారం కోసం తరచుగా
ప్రయాణిస్తుంటారని, తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ లేకపోవడం వలన చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. అనవసరమైన ఆర్ధిక భారాన్ని ఉపాధి కోసం వెళ్ళేవారికి ఆర్ధిక పరమైన భారాన్ని ఎక్కువ ప్రయాణ సమయాన్ని సీనియర్ సిటిజెన్ లకు, మహిళలు పిల్లలకు ఇబ్బందిగా మారిందన్నారు.
దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు పాశ్చాత్య దేశాలలో నివసిస్తున్న ఎన్నారైలు నేరుగా తిరుపతికి రావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కావున ప్రయాణీకుల ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తిరుపతి నుండి నేరుగా గల్ఫ్ మరియు వివిధ దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా విమానయాన సంస్థలు,విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.*

