గిరిజన సంక్షేమ పథకాల పై లిఖిత పూర్వకంగా ప్రశ్నించిన వైసీపీ రాజసభ ఎంపి మేడా రఘనాధ రెడ్డి.

Spread the love

న్యూ ఢిల్లీ మార్చి 23

(నవ్యంధ్ర న్యూస్ )

రాజ్యసభలో సోమవారం నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు,
ఎంపి మేడా రఘునాథ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ పథకాల పై ముఖ్యమైన ప్రశ్నను లిఖితపూర్వకంగా ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గాదాస్ ఉయికే సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలోని గిరిజన జనాభా వివరాలు జిల్లాల వారీగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గిరిజన సంక్షేమ పథకాల కింద కోట్ల రూపాయల నిధులు కేటాయించి వినియోగిస్తున్నట్టు వెల్లడించారు.
ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈ ఎంఆర్ఎస్ ) మొత్తం 28 పాఠశాలలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసి అన్ని పనిచేస్తున్నాయని వెల్లడించారు.
గిరిజన వర్గాల చేర్పు పై ప్రస్తుతం ఎటువంటి పెండింగ్ ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు.
గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య పథకాలు
ప్రధాన్ మంత్రి జనజాతియా వికాస్ మిషన్ (పిఎంజేఎం)
పిఎం జన్మన్ పథకం
ద్వారా ఆర్థిక సహాయం
ట్రైబల్ సబ్ ప్లాన్ ద్వారా భారీ నిధుల కేటాయింపు
2025-26 ఆర్థిక సంవత్సరానికి ట్రైబల్ సబ్ ప్లాన్ కింద రూ.8,159 కోట్లకు పైగా కేటాయించామని వెల్లడించారు.
ఈ సందర్భంగా
మేడా రఘునాథ రెడ్డి గిరిజనుల అభివృద్ధి,
విద్య,ఉపాధి అవకాశాల కోసం కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *