ముఖ్య మంత్రి గారూ!నిరుద్యోగ భృతి ఎప్పుడు?

Spread the love

ఆడ బిడ్డ నిధి ఎక్కడ?

50 ఏళ్లకే పెన్షన్ మాటేమిటి?

అన్నమయ్య జిల్లా 28

( నవ్యాంధ్ర న్యూస్ )

సూపర్ సిక్స్ హామీలలో నిరుద్యోగభృతి,ఆడబిడ్డ నిధి,50 ఏళ్లకే పెన్షన్ హామీలను ఎప్పటినుండి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజంపేట రోడ్ల భవనాల అతిథి గృహంలో శనివారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ హామీలు ప్రధాన కారణమన్నారు
సంవత్సరం దాటినా వీటిలో చాలామటుకు అమలు కాలేదన్నారు.
నిరుద్యోగ భృతి కింద నెలకు
రూ 3000 లు ఇస్తామని హామీ ఇచ్చారు.ఇప్పటివరకు 3 పైసలు ఇవ్వలేదని
ఆడ బిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ 1500 ఇస్తామన్నారు.15పైసలు ఇవ్వలేదని
ఎస్సీ,ఎస్టీ,బీసీ,ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.ప్రస్తుతం ఆ ఊసే లేదన్నారు
ముఖ్యమంత్రి గారూ! యువత, ఆడబిడ్డలను,ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలను నమ్మించి మోసగించడం న్యాయంకాదని.
వెంటనే పై హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశం లో స్థానిక అసెంబ్లీ కాంగ్రెస్ సమన్వయ కర్త పూల భాస్కర్,పిసిసి మెంబర్ అత్తింజేరి శ్రీనాథ్,మండల శాఖ అధ్యక్షుడు మహాదేవయ్య,ఒంటిమిట్ట మండల శాఖ అధ్యక్షుడు గురవయ్య, సేవాదళ్ అధ్యక్షురాలు శ్రీమతి విజయకుమారి,శివయ్య నాయుడు,నాగూరు,అమర్ నాథ్ రెడ్డి, ఉత్తన్న,నాగరాజు, శేఖర్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *