అమావాస్యపు చీకటిని తరిమి “దీపాల కాంతులను” పరిచి,” నిండైన పౌర్ణమిని తలపించేదే వెలుగుల్ని పంచే దీపావళి “.
దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటాము అన్న విషయాన్ని తెలియజేసే, ఎన్నో విషయాలు మన పురాణాలలో ఉన్నాయి… అందులో ముఖ్యమైనవి…
త్రేతా యుగంలో “రావణాసురుడు అనే రాక్షసుడిని, రాముడు యుద్ధంలో సంహరించి” శ్రీరాముడు యుద్ధంలో గెలిచి, సీతాదేవితో అయోధ్యకు తిరిగివచ్చి పట్టాభిషేకాన్ని పొందిన సందర్భంలో చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
ద్వాపర యుగంలో నరకాసుడు అనే రాక్షసుడు ప్రజలను, దేవతలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడు… అతడి ఆగడాలు శృతిమించి పోవడంతో, సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి నరకాసురున్ని సంహరించింది… సత్యభామ నరకాసురున్ని సంహరించి ప్రజలందరిని కాపాడింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
కానీ, ఈ కలియుగంలో చెడు ఎక్కడో లేదు, మన మనసులోని చంచలత్వం, స్వార్థం ,ఈర్ష ,ద్వేషం ఇటువంటి ప్రతికూల భావాలతో నిండిపోయి ఉంది… మన మనసులోని ఇటువంటి చెడ్డ ఆలోచనలపై, మనమే యుద్ధం చేసి, మనలోని మంచిని బయటికి తీసుకువచ్చి, మనల్ని మనం సంస్కరించుకోవడమే. ఈ కలియుగంలో అసలైన దీపావళి పండుగ…
అజ్ఞానం అనే చీకటి పొరలను చీల్చి జ్ఞానమనే వెలుగులతో మనసుని నింపుకొని, రంగు రంగు వెలుగుల నీడలో, ఈ దీపావళి పండుగను ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుందాం… ” మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు”.
┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈
ఆధ్యాత్మిక అన్వేషకులు
🍁🪄🍁 🙏🌺🙏 🍁🪄🍁

