ఢిల్లీ డిసెంబర్ 11
(నవ్యంధ్ర న్యూస్ )
పార్లమెంట్ సమావేశాలలో వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రజా ప్రయోజనలు,రోడ్డు ప్రమాదాల దృష్ట్యా జాతీయ రహదారి-716 కడప నుంచి రేణిగుంట సెక్షన్ రహదారి పై ప్రసంగించారు. రాయలసీమ ప్రజలకు ప్రధాన మార్గంగా
ఈరహదారిఉపయోగ
పడుతున్నప్పటికి
గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు మొదలు అవ్వడంతో పాత రహదారి పై భారీ ట్రాఫిక్ మల్లింపుల కారణంగా రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు.
ప్రయాణీకులు,
విద్యార్థులు,రోగులు,
వాహన డ్రైవర్లకు ప్రయాణం చేయడానికి తీవ్ర కష్టంగా ఉందని,
ఈ రోడ్డుకు సరైన అలైన్మెంట్ లేకపొవడంతో అనేక ప్రమాదకరమైన చిన్న మలుపులు
ఉన్నాయని రాత్రులు ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉన్నదన్నారు
ఈ రహదారిలోని గుంతలు పూడ్చి
ప్రమాదకర మలుపుల వద్ద సూచిక బోర్డులు,భద్రతా సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు.
కొత్త రహదారి పూర్తి అయినప్పటికీ ఈ పాత రహదారి ఉపయోగంలో ఉంటుందని
కొత్త రహదారి పై రద్దీని తగ్గిస్తుందని, రహదారి నిర్మాణ సమయంలో రాయలసీమ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ మధ్యంతర రహదారుల పనులు పూర్తయే స్పష్టమైన కాలపరిమితిని తెలియజేలా కాంట్రాక్టర్ కు ఆదేశాలు ఇవ్వాలని రవాణా శాఖ మంత్రిని కోరారు.

