డిల్లీ డిసెంబర్ 10
(నవ్యంధ్ర న్యూస్ )
వైసీపీ పార్లమెంటరీ నాయకులు వైవి.సుబ్బారెడ్డి,వైసీపీ లోక్ సభ పీవి మిధున్ రెడ్డి,రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్ర బోస్,రాజ్యసభ ఎంపీలు మేడా రఘునాధ రెడ్డి , అయోధ్యరామిరెడ్డి,
గొల్లబాబు రావు,
లోక్ సభ ఎంపీలు మద్దిల గురుమూర్తి,గుమ్మా తనూజారాణిలు కలసి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసిన వైద్యకళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ,రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టి ర్యాలీ,ఉద్యమాలు నిర్వహిస్తూన్న నేపధ్యంలోప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి
నిర్మలాసీతారామన్ ని కలిసి ఆందోళన వ్యక్తం చేసి.ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్యకళాశాలలను
ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంరించుకునేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ వినతిపత్రంఅందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు
అప్పగించేందుకు టిడిపి ప్రభుత్వం
ప్రయత్నిస్తునందున పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ప్రత్యేకంగా ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య,విద్య అవకాశాలు కోల్పోతరనికి ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కళాశాలల భూములను తక్కువ ధరలకు ప్రైవేటు సంస్థలకు లీజ్ ఇవ్వాలనే ఆలోచనలు రాష్ట్ర
వ్యాప్తంగా తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని, ప్రభుత్వ వైద్యసేవలలో నాణ్యత లోపించి, సామాన్య ప్రజలకు వైద్యం దూర మవుతుందన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలలలో 7 పూర్తి చేసి,పేద,గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్యవిద్యను అందుబాటులోకి తీసుకువచ్చినదని ఎంపీలు మంత్రికి గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో వైద్యుల కొరత సృష్టించి, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన
వ్యక్తం చేస్తూ కోటి కంటే ఎక్కువ సంతకాలు సేకరించరన్నారు.
ఈ సంతకాలను రాష్ట్ర గవర్నర్కు ఈ నెల 17వ తేదీసమర్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు చేతులలోకి ఇవ్వకూడదనే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ,ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు.

