చెట్లు వేర్లతో సహా తొలగిస్తుంటే పట్టించుకునే వారే లేరా

Spread the love

చెట్లు కొట్టేస్తుంటే అటవీ శాఖ,మునిసిపల్ అధికారులు పట్టించుకోరా

ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారే గాని నీడను నిచ్చే చెట్లను కొట్టేస్తుంటే మాత్రం ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ఎవరిది ఈ పాపం

రోడ్డు పక్కన ఉండటం శాపమా

అన్నమయ్య జిల్లా సెప్టెంబర్

( నవ్యాంధ్ర న్యూస్ )


రాజంపేట పట్టణంలో రోడ్డు పక్కన పది మందికి నీడ ఇవ్వడం తప్ప అదే ఈరోజు మాకు శాపంలా మారింది ఇది ఎవరి పాపం అని దీనంగా రోడ్డుపైన మొండిగా దీనవదనంతో వేడుకుంటున్నాయి. విద్యుత్తు, మున్సిపాలిటీ అధికారులకు రెండో శనివారం అంటేనే అది వారికి పండగలా ఉంటుంది. చెట్లు పెరిగాయని, తీగలకు అడ్డొస్తున్నాయని నెపంతో చెట్లను తెగ నరుకుతున్నారు. పర్యావరణవేత్తలు, ఉన్నత అధికారులు మాత్రం పర్యావరణం పరిరక్షణ పేరుతో వేలు , లక్షలు ఖర్చు పెడుతున్నారు తప్ప ఉన్న చెట్లను కాపాడాలన్న ధ్యాస లేకుండా పోతుంది. వాతావరణంలో కలుషితమైన అయినా గాలిని తగ్గించేందుకు ప్రపంచ సమాజం నడుము బిగిస్తుంటే రాజంపేటలో అధికారుల తీరు మరోలా ఉంది. అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *