గగనతలంలో పెను విషాదం
ఆకాశమంత అతి ఘోరం
నీలాల నింగికి చేరకుండానే
నేల రాలిన మానవ స్వప్నాలు…!
అహ్మదాబాద్ జూన్ 13
( నవ్యాంధ్ర న్యూస్ )
అహ్మదాబాద్ నుంచి…
లండన్ కి ఉరిమే ఉత్సాహంతో
విమానయాన ప్రయాణీకులు
అందులో నుండిరి వృద్ధులు
యువకులు, చిన్నారులు..!
సాంకేతిక పర లోపాలో
సంకుచితమైన విద్రోహాలో….
కుప్పకూలిపోయింది.. బోయింగ్ విమానం…!
కాలిన వందలాది ప్రయాణీకులు
స్వదేశీ, పరదేశీయులు దుర్మరణాలు
భారీ విమానం పడిపోయి తుదిశ్వాస
విడిచిన యువ వైద్యుల మాడిన దేహాలు
ఆకాశ చరిత్రలో మరువలేని దుర్ఘటన…!
నల్లటి మేఘాల్లా.. చెదిరిన శకలాలుగా
బంధువులు,ఆత్మీయుల ఆర్తనాదాలు
వాహనాల ప్రయాణాలు.. రక్త సిక్తమయితే
ఆకాశయాన పయనాలు..అనంత ఘోరాతి ఘోరం..!?
బ్లాక్ బాక్స్ లను బయటకు తీయాలి
ప్రమాద కారణాలను పసి కట్టుతూ
భవిష్యత్ లో గగనతల ప్రయాణాల
పెను ప్రమాదాలను నివారించాలి