దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం

Spread the love

( నవ్యాంధ్ర న్యూస్ ) 2025 జనవరిలో 100 వ రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తరువాత రాకెట్ లాంచ్ కు సిద్ధమవుతుంది ఈనెల 18 ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి సీఎస్ఎల్ వీ సీ 61ను ప్రయోగించునుండగా….

ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ పరిశోధన ఉపగ్రహం రీశాట్ 18 ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నా రు. శనివారం ఉదయం 7:59 గంటలకు ఈ మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది..

నిరంతరంగా 22 గంటల పాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 గంటలకు రాకెట్ నింగులోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో చైర్మన్ నారాయణన్ గురువారం సాయంత్రమే షార్ కు చేరుకున్నారు.

ఈ సారి నింగిలోకి ఎన్వీఎస్ 02 శాటిలైట్ వెళ్లనుంది. ఇది నావిక్ రెండో సిరీస్‌కి సంబంధించినది. ఇది ఇచ్చే సమాచారం.. మ్యాప్‌లకు బాగా ఉపయోగపడు తుంది. భూమి, ఆకాశం, నీటిపై ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది.

ఇది మొత్తం 2,250 కేజీల బరువు ఉన్న శాటిలైట్. ఇది భూ కక్ష్యా మార్గంలోకి వెళ్లాక.. జీపీఎస్ సేవల్ని అందిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *