మా గురించి…
“నవ్యాంధ్ర న్యూస్”కి స్వాగతం. ఇది నమ్మదగిన, సమయానికి వచ్చే వార్తల కోసం మీకు ఒక ఖచ్చితమైన న్యూస్ ప్లాట్ ఫామ్. 2004 నుంచి 2025 వరకు, 21 ఏళ్లకు పైగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలో అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ “గాడి అశోక్” గారు ఈ “నవ్యాంధ్ర న్యూస్” వెబ్ సైట్ ను స్థాపించారు.
మా ప్రేక్షకులకి కచ్చితమైన, ప్రభావవంతమైన వార్తలు త్వరితంగా ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము.
మా “నవ్యాంధ్ర న్యూస్” ఛైర్మన్ శ్రీ.”గాడి అశోక్”, బి.ఎ., (ఎల్ఎల్బి), గారు, ఆంధ్రప్రదేశ్ లోని రాజంపేటలో 1976 లో జన్మించారు. ఆయన “గాడి ఎల్లారెడ్డి” మరియు “గాడి సావిత్రమ్మ” గార్ల కుమారుడు.

శ్రీ.”గాడి అశోక్” గారు, మా టీవీ, 1 టీవీ ఛానల్స్, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ మరియు సూర్య దినపత్రికలు వంటి ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేశారు.
జర్నలిజంపై లోతైన అవగాహన కలిగిన ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే కృత నిశ్చయంతో…. ఆయన ప్రస్తుతం SCN ఛానల్ లో కొనసాగుతూ… ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలకు నిజమైన వార్తలను త్వరితంగా అందించడానికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ “నవ్యాంధ్ర న్యూస్” వెబ్ సైట్ ను స్థాపించారు.
“నవ్యాంధ్ర న్యూస్” లో… నిష్పక్షపాతమైన, సమగ్రమైన మరియు ఆసక్తికరమైన వార్తా కథనాలను ఎప్పటికప్పుడు అందించడం మా లక్ష్యం. ఇది సమాజ స్పందనను సైతం ప్రతిబింబిస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ అయినా, లోతైన విశ్లేషణ అయినా లేదా స్థానిక కథనాలైనా, మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, మీతో కనెక్ట్ అవుతూ… ఉండటానికి మేము ఎల్లవేళలా ప్రయత్నిస్తాము.
మా ప్రధాన దృక్పథం:
మేము చెప్పే ప్రతి కథనంలో సమగ్రత, పారదర్శకత మరియు శ్రేష్ఠతను కలిగి ఉంటూ ప్రాంతీయ జర్నలిజంలో అగ్రగామిగా ఉండాలని కోరుకుంటున్నాము.
మమ్మల్ని సంప్రదించండి:
గాడి అశోక్
ఫౌండర్ & ఛైర్మన్,
నవ్యాంధ్ర న్యూస్
చిరునామా:
6/985, నూని వారి పల్లి, రాజంపేట – 516 115, ఆంధ్రప్రదేశ్.
ఫోన్: 73964 10372
ఇమెయిల్: navyaandhranews2025@gmail.com